మోదీ బయోపిక్ రిలీజ్ కు అడ్డంకులు

SMTV Desk 2019-03-26 10:55:23  Modhi Biopic, EC, congress

‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 5న విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈక్రమంలో కపిల్ సిబాల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు సోమవారం ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కపిల్ సిబాల్ మీడియాతో మాట్లాడుతూ..

‘ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఎన్నికల ముందు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దానిని ఆపాలి. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ బీజేపీకి చెందిన వారే. ఎన్నికలకు ముందు ఉద్దేశ్యపూర్వకంగా సినిమా విడుదల చేయడం ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు (మే 19) సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలి’ అని ఈసీని కోరినట్లు చెప్పారు.