కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణ

SMTV Desk 2019-03-26 10:52:51  Ka Paul,

భీమవరం: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నామినేసన్‌ను అధికారులు తిరస్కరించారు. సమయం మించిపోయిన తర్వవాత రావడంతో అధికారులు తిరస్కరించినట్టు తెలుస్తోంది. భీమవరంలో నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ ఆలస్యంగా వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్న సమయంలో నామినేషన్ వేసిన పాల్ భీమవరం అసెంబ్లీ అభ్యర్ధిగా కూడా పోటీ చేయాలని భావించారు. మొన్న నరసాపురం పార్లమెంటులో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ రోజు మధ్యాహ్నం నరసాపురం నుంచి బయల్దేరిన కేఏ పాల్ భీమవరానికి సమయానికి చేరుకోలేక ఆలస్యంగా వెళ్లారు. నాలుగు గంటల పది నిమిషాలకు అధికారి ముందుకు వెళ్లారు. అయితే ఆలస్యంగా వచ్చినందున కేఏ పాల్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం జరిగింది. తన నామినేషన్ తిరస్కరణ వెనక కుట్ర దాగి ఉందని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.