కుప్పకూలిన దేశీ స్టాక్ మార్కెట్

SMTV Desk 2019-03-26 10:14:23  Sensex, Nifty, Stock market, Share markets

మార్చ్ 25: అంతర్జాతీయ ప్రతికూల పవనాల వల్ల సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. సెన్సెక్స్‌ 356 పాయింట్ల నష్టంతో 37,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 11,354 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 50లో ఐఓసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, గెయిల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. ముడిచమురు ధరల పతనం ఆయిల్ రంగ షేర్లకు కలిసొచ్చింది. అదేసమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, యూపీఎల్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. జీ షేర్లు 4 శాతానికి పైగా పడ్డాయి.