బుమ్రాకు గాయం...నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటాడా!

SMTV Desk 2019-03-25 19:06:41  Jasprit Bumrah Injured During Match, mumbai indians, mi vs dc

ముంబయి, మార్చ్ 25: ఐపీఎల్ 2019 సీజన్‌లో వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయ పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆడిన బంతిని ఆపే క్రమంలో బుమ్రా ఎడమ భుజానికి గాయమైంది. దాంతో జట్టు సభ్యులు వెంటనే ఆయన్ను మైదానం బయట ఫిజియోథెరపిస్ట్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స చేశారు. ఈ గాయం కారణంగా బుమ్రా బ్యాటింగ్‌కు దిగలేదు. మరోవైపు బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడని ముంబయి ఇండియన్స్ యాజమాన్యం వెల్లడించింది. తరువాతి మ్యాచులో ఆడేది లేనిది సోమవారం పరీక్ష అనంతరం తెలియజేస్తామని చెప్పుకొచ్చింది.