నామినేషన్లు వేసిన నిజామాబాద్‌ రైతులు

SMTV Desk 2019-03-25 17:40:08  nijamabad formers, nominations, loksabha elections

నిజామాబాద్‌, మార్చ్ 25: నిజామాబాద్‌ జిల్లాలో రైతులు పసుపు పంటకు మద్దతు ధర డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేయడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ దాఖలైన నామినేషన్లలో ఎక్కువ శాతం రైతుల నామినేషన్లే ఉన్నాయి. నేడు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రైతులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు చెరకు రైతులు నామినేషన్‌ వేయనున్నారు.