ఎలుక కడుపులో పట్టుపడ్డ డ్రగ్స్

SMTV Desk 2019-03-25 17:39:21  drugs in rat stomach, england, police

ఇంగ్లాండ్, మార్చ్ 25: రోజురోజుకి డ్రగ్స్ మాఫియా అంచెలంచలుగా పెరుగుతూ పోతోంది. డ్రగ్స్ ని తరలించడంలో నేరస్తులు సరికొత్తగా ప్లాన్స్ వేస్తున్నారు. ఇదే తరాహలో ఇంగ్లాండ్ లో ఉన్న ఒక జైలులో ఉన్న కొంతమంది ఖైదీలకు సీక్రెట్ గా సిమ్ కార్డ్స్, సెల్ ఫోన్స్, డ్రగ్స్ సీక్రెట్ గా చేరిపోతున్నాయట. చచ్చిపోయిన ఎలుకల పొట్టలో డ్రగ్స్, సిమ్ కార్డ్స్ వంటివి పెట్టి.. ఆ పొట్టను దారంతో కుట్టేస్తున్నారు స్మగ్లర్స్. ఇక ఆ ఎలుకల్ని జైలు గోడల అవతల నుంచి.. జైలులోకి విసిరేస్తున్నారు. ఖైదీలు ఆ ఎలుకల్ని సీక్రెట్ గా పక్కకి తీసుకెళ్లి, పొట్టను తెరిచి.. వాటిలోని డ్రగ్స్, సిమ్ కార్డ్స్ వంటివి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జైలు గోడల ప్రక్కన చచ్చిపడిన మూడు ఎలుకల్ని చూసిన పోలీసులు.. వాటి పొట్టలు కుట్టినట్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. దీనితో అసలు విషయం తెలుసుకుని.. సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.2018 మార్చి నాటికి… ఏడాది కాలంలో ఇంగ్లండ్, వేల్స్ జైళ్లలో డ్రగ్స్ దొరికిన ఘటనలు 13,119 దాకా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది కంటే అవి 23 శాతం ఎక్కువ. ఇక జైళ్లలో మొబైళ్లు దొరుకుతున్న ఘటనలు 15 శాతం పెరిగి… 10,643కి చేరాయి.