త్వరలో దర్శనమివ్వనున్న పల్సర్ 250

SMTV Desk 2019-03-25 17:30:53  pulsar 250, bajaj

మార్చ్ 25: బజాజ్ కంపెనీ తాజాగా తన పల్సర్ (యూజీ6 ప్లాట్‌ఫామ్) బైక్స్‌పై దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే పల్సర్ 250 బైక్‌‌ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. బజాజ్ ఆటో నెక్ట్స్ జనరేషన్ పల్సర్ బైక్స్‌పై పనిచేస్తోందని వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అడ్వాన్స్‌డ్ కాంపొనెంట్స్, స్విచ్ ఆఫ్ టెక్నాలజీ వంటి వాటితో వీటిని రూపొందించేందుకు రెడీ అవుతోందని తెలిపాయి. కొత్త బైక్స్‌లో ఫ్యూయెల్ ఇన్‌జెక్షన్, ఫోర్ వాల్వ్ సెటప్, బీఎస్ 6 ప్రమాణాలకు అనువైన ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చని తెలిపాయి. 2020 కల్లా పల్సర్ 250 బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశముందని అంచనా. పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌కు ఇది అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఉండొచ్చు. కంపెనీ కేటీఎం 250 డ్యూక్‌ మాదిరే ఇందులోనూ 249 సీసీ ఇంజిన్ అమర్చవచ్చు. ఆరు గేర్లు, స్లిప్పర్ క్లచ్ వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు. బైక్ ధర రూ.1.2 లక్షలు నుంచి రూ.1.5 లక్షల శ్రేణిలో ఉండే అవకాశముంది.