మజిలీ vs సూపర్ డీలక్స్

SMTV Desk 2019-03-25 17:25:18  Samantha, Super delux, majili

పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల జోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో మజిలీ.. తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలు చేస్తుంది సమంత. మజిలీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుండగా మార్చి 29న సూపర్ డీలక్స్ రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వారం గ్యాప్ తో వస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాల మీద సమంత ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఇందులో విశేషం ఏంటంటే రెండు సినిమాల్లో సమంత ఒకే రకమైన పాత్రలు చేసిందట. మజిలీలో మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తుండగా.. సూపర్ డీలక్స్ లో కూడా గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా నటిస్తుందట. రెండింటిలో సమంత అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. నాగ చైతన్య హీరోగా వస్తున్న మజిలీపై మంచి అంచనాలు ఏర్పడగా.. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సూపర్ డీలక్స్ పై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి సమంతతో సమంత పోటీ ఎలా ఉంటుందో చూడాలి.