పాక్ పై అతిక ప్రేమ చూపిస్తున్న చైనా

SMTV Desk 2019-03-25 17:24:24  pakistan, china, pakistan terrorists

చైనా, మార్చ్ 25: పాకిస్తాన్ కు చైనా ఎప్పటికప్పుడు ఎదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంది. ఓ వైపు పాక్ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు అన్ని యుద్ధం చేస్తుంటే చైనా మాత్రం అందుకు పూర్తి వ్యతిరేఖంగా పాక్ ను వేనుకేసుకొస్తుంది. పాకిస్థాన్‌కు చైనా మోరల్‌ సపోర్ట్‌తో పాటు ఆర్థికంగా కూడా సహకరిస్తుంది. నిధులను నేరుగా కాకుండా చైనా ఉత్పత్లు ద్వారా పాక్‌ ఉగ్రవాదులకు నిధులు అందేలా చూస్తోంది. చైనా దిగుమతులపై ఉక్కుపాదం మోపేందుకు ఇండియన్‌ పోర్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని కోరుతోంది. కాగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులను ఇన్‌ వాయిస్‌లో తక్కువ చూపించి, ఉగ్రవాదానికి నిధులు అందిస్తున్నాయని సిఎఐటి ఆరోపించింది. తక్కువ దిగుమతి సుంకం, తక్కువ జిఎస్‌టి వర్తించేలా వచ్చే చాలా కేసుల్లో, దిగుమతి చేసుకున్న అసలుతో మెటిరీయల్‌ సరిపోలడం లేదని సిఎఐటి చెబుతోంది. దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో మెటిరియల్‌తోపాటు డాక్యుమెంట్ల పరిశీలనను చేపట్టాల్సి ఉందని వారు కోరుతున్నారు.