వేసవిలో చల్లని కబురు .. నేడు, రేపు తెలంగాణలో మోస్తారు వర్షాలు

SMTV Desk 2019-03-25 17:07:53  rains, Hyderabad

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ సూచించింది.