క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా

SMTV Desk 2019-03-25 17:01:49  Southa africa, sri lanka

శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో సఫారీలు 45 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి) తేడాతో లంకపై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 198 పరుగులు చేసింది. హెండ్రిక్స్(66), పిస్టోరియస్(77నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, వాండర్సే చెరో వికెట్ పడగొట్టారు.

ఇక వర్షం కారణంగా 17 ఓవర్లలో 183 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని ఛేదించడంలో లంక ఆరంభం నుంచే ఇబ్బందులు పడింది. సఫారీ బౌలర్ ఫెలుక్వాయో (4/24) విజృంభించగా లంక 15.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. డిక్విల్లా(38), ఉదానా(36)లు మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.