మొదటిసారి స్వాతంtr దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న మదరసా

SMTV Desk 2017-08-11 18:32:38  UTTARAPRADESH, MADARASA, INDIPENDENCE DAY, INDIAN FLAG

యూపీ, ఆగస్ట్ 11 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సమయం సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఆ రాష్ట్ర మదరసా కమిటీ అంగీకరించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల మ‌ద‌ర్సాలు ఉ౦డగా, అన్ని మదర్సాలూ ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొ౦టాయి. అంతేకాకుండా జెండా ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించాలని మ‌ద‌ర‌సా శిక్ష ప‌రిష‌త్‌ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. కాగా ఆగస్టు 15న ఉదయం 8 గంటలకు ఆ రాష్ట్రంలోని అన్ని మదరసాలలో జాతీయ‌ జెండాను ఎగ‌ర‌వేయ‌నున్నట్లు మదరసా కమిటీ నిర్ణయం తీసుకుంది.