మహేశ్‌బాబుతో సెల్ఫీ దిగాలనుకుంటున్నారా?

SMTV Desk 2019-03-25 16:56:41  Mahesh Babu, mdam tussad

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ మహేశ్‌బాబుతో సెల్ఫీ దిగాలనుకుంటున్నారా? వెంటనే గచ్చిబౌలిలోని అతని ఏఎంబీ సినిమా థియేటర్‌కు వెళ్లండి. అక్కడ మహేశ్ బాబు ఉలక్కుండా పలక్కుండా ఊరికే నిల్చుని ఉన్నాడు. అతని పక్కన ఎంతసేపున్నా ఏమీ అనడు. ఎన్ని సెల్ఫీలు తీసుకున్నా ఏమీ అనడు. ఎందుకంటే అది బొమ్మ కనుక.

మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్‌కు పట్టుకొచ్చి ఆ థియేటర్లో ఈ రోజ నుంచి ప్రదర్శనకు ఉంచారు. దీన్ని మహేశ్, అతని భార్య, పిల్లలు కలసి ఆవిష్కరించారు. ఈ బొమ్మను సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తయారు చేశారు. అంతకు ముందు హైదరాబాద్ కు వచ్చి అతన కొలతలు తీసుకున్నారు. దీన్ని మళ్లీ రేపు సింగపూర్‌కు పట్టుకెళ్తారు. అందుకే అభిమానులు ఆ బొమ్మతో సెల్ఫీలు కొట్టించుకోడానికి విపరీతంగా ఎగబడుతున్నారు.