లోకేష్ పై వైఎస్ షర్మిల పంచ్ లు

SMTV Desk 2019-03-25 16:51:03  Nara Lokesh, Sharmila

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి, ఈ క్రమంలో వైసీపీ తరఫున జగన్ సోదరి వైఎస్ షర్మిల బస్సు యాత్ర చేయనున్న సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ చంద్రబాబు లోకేష్ లపై ఆమె తనదైన శైలిలో సెటైర్లు వేశారు, అసలు జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేశ్ కు చంద్రబాబు మూడు మంత్రి పదవులు అప్పగించారని సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రశ్నించరన్న నమ్మకంతోనే బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని షర్మిల ఆరోపించారు. బాబు,మోదీల జోడీ వల్లే ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు పాలనలో సామాన్యుడు సంతోషంగా లేడని, “చందమామను తెచ్చిస్తా” అంటూ చంద్రబాబు చెప్పే అబద్ధాలను ఏపీ ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు పదవి కోసమే పథకాలు ప్రకటిస్తారనీ, ప్రజలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంట్రాక్టుల కోసమే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాగేసుకున్నారని వ్యాఖ్యానించారు. నిప్పునిప్పు అని చెప్పుకున్నంత మాత్రాన తుప్పు నిప్పు అయిపోతుందా? అని ప్రశ్నించారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నంత మాత్రన అబద్దాలు నిజాలు అయిపోవని స్పష్టం చేశారు. చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని దుయ్యబట్టారు.