నారా లోకేష్ పై పోటీకి జనసేన అభ్యర్థిని నిలబెట్టిన పవన్

SMTV Desk 2019-03-25 13:41:52  nara lokesh, pawan kalyan

నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానం నుండి జనసేన పోటీ చేయకుండా పొత్తుల్లో భాగంగా సీపీఐ అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరరావుకు కేటాయించింది. దీంతో లోపాయికారీ వ్యవహారంలో భాగంగానే లోకేష్ గెలుపును సులభతరం చేయడానికి జనసేన బరిలోకి దిగకుండా సీపీఐకి టికెట్ ఇచ్చారని వైకాపా ఆరోపణలకు దిగింది. మంగళగిరి జనసేన కేడర్ సైతం అక్కడ జనసేన అభ్యర్థి ఉంటే బాగుంటుందని పట్టుబట్టింది.

దీంతో పవన్ ఆఖరు నిమిషంలో డెసిషన్ మార్చుకుని జనసేన అభ్యర్థిగా చల్లపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. నిన్న అర్థరాత్రి బీఫామ్ చేతికిచ్చారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు. దీంతో మంగళగిరి పోరు రసవత్తరంగా మారింది. మరోవైపు ఇలా ఉన్నట్టుండి అభ్యర్థిని మార్చడంతో సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.