రావణుడు సీతని దాచింది ఇక్కడే!!!

SMTV Desk 2017-08-11 18:03:58  Team India, mohammed shami, Umesh Jadav, Sita eliya, KL Rahul, Srilanka Tour

శ్రీలంక, ఆగస్ట్ 11: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి ఇప్పటికే రెండు టెస్ట్‌లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం శ్రీలంక విహార యాత్రలో ఉన్నారు. కాగా, వీరు ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. అది రావణుడు సీతను దాచిన చోటు. నువారా ఎలియా జిల్లాలోని సీతా ఎలియా అనే గ్రామంలో ఉన్న అశోక వనానికి క్రికెటర్లు వెళ్లారు. ఉమేష్ యాదవ్‌, మహ్మద్ ష‌మి, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శ‌ర్మ‌, కుల్‌దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ అక్కడికి వెళ్లారు. అయితే ఒక్కో ఆటగాడు అక్కడి ఒక్కో విశిష్టతను తెలుపుతూ పోస్ట్‌లను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే శ్రీలంక పర్యాటనలో మిగిలి ఉన్న మూడో టెస్ట్ రేపు ఆడనున్నారు.