DC vs MI : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి

SMTV Desk 2019-03-25 13:10:16  dc vs mi, mi won the toss choose to bowl

ముంబయి, మార్చ్ 24: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబయి ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు ముగియగా.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మూడేసి సార్లు టైటిల్ గెలిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు, రాజస్థాన్ రాయల్స్ , డక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఢిల్లీ జట్టు నిరాశపరచగా.. ముంబయి ఇండియన్స్‌ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో.. కనీసం ఈ ఏడాదైనా.. మెరుగ్గా ఆడాలని ఇరుజట్లూ కోరుకుంటున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుని మరీ.. ఈ ఏడాది ఢిల్లీ బరిలోకి దిగుతోంది.

Delhi Capitals Team : Shikhar Dhawan, Prithvi Shaw, Shreyas Iyer (C), Colin Ingram, Rishabh Pant (WK), Sherfane Rutherford, Axar Patel, Rahul Tewatia/Amit Mishra, Sandeep Lamichhane, Ishant Sharma/Avesh Khan, Trent Boult

Mumbai Indians Team : Rohit Sharma (C), Suryakumar Yadav, Ishan Kishan (WK), Yuvraj Singh, Kieron Pollard, Krunal Pandya, Hardik Pandya, Ben Cutting, Mitchell McClenaghan, Mayank Markande, Jasprit Bumrah.