దాని కోసం ఓ డ్రింక్ తాగాడు అంతే....6 గంటలసేపు అంగస్తంభన!

SMTV Desk 2019-03-25 13:08:37  males, Power SX Energy Drink, Revin Zambia

జాంబియా, మార్చ్ 24: మగవారు అంగస్తంభన వంటి సమస్యలతో బాధపడేవారు రకరకాల మందులు వాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే జాంబియాలోని ఓ వ్యక్తి ఎనర్జీ డ్రింక్ తాగాడు అంతే అతని అంగం స్తంభించి ఆరు గంటల వరకు అలాగే వుండిపోయిందట. అయితే అతను భయపడి వైద్యులను సంప్రదించగా అతను తాగిన ఎనర్జీ డ్రింక్ ప్రభావం వల్లే అంగం స్తంభించిందని వైద్యులు వెల్లడించారు. ఆ ఎనర్జీ డ్రింక్ పేరు ‘పవర్ నేచురల్ హై ఎనర్జీ డ్రింక్ ఎస్‌ఎక్స్’. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ డ్రింక్‌ను నిషేదించారు. ఈ డ్రింకును జాంబియాలో తయారు చేస్తున్నారు. వాటిని జింబాబ్వే, ఉగాండ, మలవి వంటి ఆఫ్రికా దేశాలకు కూడా ఆ డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఈ ఎనర్జీ డ్రింకుకు చాలా ఆదరణ ఉంది. అత్యధిక పురుషులు దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఉగాండకు చెందిన ఓ వ్యక్తి ఆ డ్రింక్ తాగడంతో ఆరు గంటల వరకు అతని అంగం స్తంభించింది. దీంతో అతను చాలా ఇబ్బంది పడ్డాడు. వెంటనే అధికారులకు వెళ్లి ఆ డ్రింకుపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ డ్రింకును తయారు చేస్తున్న సంస్థకు ఉగాండ నేషనల్ డ్రక్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. ఆ డ్రింకులో వయాగ్రాలో ఉండే ‘సిల్డెనఫిల్ సిట్రటా’ ఉన్నట్లు కనుగొన్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ డ్రింక్‌పై నిషేదం విధిస్తున్నామని, వాటిని ఉత్పత్తిని నిలిపేయాలని ఆదేశించింది. అయితే ఇందులో ఎలాంటి డ్రగ్స్ కలపలేదని రెవిన్ జాంబియా సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ వికాశ్ కపూర్ తెలిపారు.