ప్రతీ నియోజకవర్గానికి రూ.100 కోట్లు

SMTV Desk 2019-03-25 13:07:40  ka paul, assembly elections

విజయవాడ, మార్చ్ 24: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ విజయవాడలో తాజాగా మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...తాము గెలిస్తే విజయవాడను హైదరాబాద్‌ కన్నా మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. భ్యాంకులో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తమను గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఏడాదిలో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రకటించారు. తిరుపతి, విశాఖ నగరాలను ఇంకా అభివృద్ధిపరుస్తాం. రైతు, చేనేత, డ్వాక్రా, ఆటోవాలాలకు ఏడాదిలోనే రుణాలన్నీ మాఫీ చేస్తా. నిరుద్యోగులకు ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. జిల్లా కేంద్రాల్లో కనీసం 5 నుంచి 10 కంపెనీలు పెట్టి ప్రతి జిల్లాకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం. ఎవరూ చేయని ఎనిమిది పనులు నేను చేశాను. నేను నోరు విప్పి మాట్లాడాలి గానీ నిమిషానికి రూ.కోటి నుంచి రూ.5 కోట్లు ఇస్తారు. దేవుడి కృప వల్ల ఏడు యుద్ధాలు ఆపాను. 17 సార్లు ఏడు దేశాల నుంచి నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యాను’ అని తెలిపారు పాల్.