181 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి KKR

SMTV Desk 2019-03-25 13:06:18  srh vs kkr, ipl 2019, kkr won the toss choose the bowl

కోల్‌కతా, మార్చ్ 24: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెకెఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత సీజన్‌లో ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమితో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్..ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో క్రీజులోకి వెళ్లి కోల్‌కతాకు 181/3 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఐపీఎల్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పునరాగమనం అదిరింది. బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధం వేటు పడటంతో ఐపీఎల్ 2018 సీజన్‌కి దూరమైన డేవిడ్ వార్నర్ (85: 53 బంతుల్లో 9x4, 3x6) .. ఈరోజు మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేశాడు. వార్నర్ కేవలం 31 బంతుల్లోనే 8x4, 1x6 సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో వార్నర్‌కి ఇది 40వ అర్ధశతకం. మ్యాచ్‌లో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (39: 35 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి తొలి వికెట్‌కి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వార్నర్.. సన్‌రైజర్స్‌కి మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Andre Russell, Piyush Chawla, Kuldeep Yadav, Lockie Ferguson, Prasidh Krishna.

Sunrisers Hyderabad (Playing XI): David Warner, Jonny Bairstow(w), Manish Pandey, Deepak Hooda, Shakib Al Hasan, Vijay Shankar, Yusuf Pathan, Rashid Khan, Bhuvneshwar Kumar(c), Sandeep Sharma, Siddarth Kaul.