రాంమాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

SMTV Desk 2019-03-25 12:41:25  ram madhav

జాతీయ స్థాయిలో ఎన్నికలు వస్తే చాలు... పాకిస్థాన్ కీలక అంశంగా మారుతుంది నేతలకు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండు వైపులా నేతలు... పాకిస్థాన్‌ పేరును వాడుకుంటూ... ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజల్లో లేనిపోని ధ్వేషభావాన్ని పెంచేందుకు యత్నిస్తుంటారు. తద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుంటారు. ముస్లిం వర్గాల్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండటంతో... ఆ పార్టీకీ, పాకిస్థాన్‌కీ సంబంధం అంటకడుతూ... బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌహతీలో ఉన్న ఆయన... ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ట్వీట్లకు... ఇండియాలో కంటే... పాకిస్థాన్‌లో ఎక్కువగా రీట్వీట్లు వస్తున్నాయని సెటైర్ వేశారాయన. కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎప్పటికైనా గెలిచే అవకాశాలుంటాయని కామెంట్ చేశారాయన. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అలా ఉందని కౌంటర్ వేశారు.

అసోంలో 14 లోక్ సభ స్థానాలుండగా... బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ 10 స్థానాల్లోనూ గెలుస్తామన్న రాంమాధవ్... బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి ఈసారి ఈశాన్య భారతంలో అన్ని లోక్ సభ స్థానాలనూ గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న మొదలయ్యే లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. చివరి దశ మే 19న జరగనుంది. మే 23న కౌంటింగ్ ఉంటుంది.