SRH vs KKR : టాస్ గెలిచి ఫీల్డింగ్ కు కోల్‌కతా

SMTV Desk 2019-03-25 12:36:59  srh vs kkr, ipl 2019, kkr won the toss choose the bowl

కోల్‌కతా, మార్చ్ 24: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెకెఆర్ ఫీల్డింగ్ నుం ఎంచుకుంది. ఇక అదరగొట్టే విజయంతో బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. గత సీజన్‌లో ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమితో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్..ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ విలియమ్సన్‌కు తోడు మార్టిన్ గప్టిల్, బెయిర్‌స్టో, యూసుఫ్ పఠాన్, విజయ్ శంకర్, మనీశ్ పాండే లాంటి వారితో బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో నిషేధం నుంచి ఇంకా బయటపడని వార్నర్‌పైనే అందరి కండ్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో సత్తాచాటడం ద్వారా తనపై పడ్డ మచ్చను తొలిగించుకునేందుకు వార్నర్ వీరోచితంగా పోరాడే అవకాశముంది. కాగా నేడు జరిగే మ్యాచ్ కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని కోల్‌కతా కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉంది. సొంతగడ్డపై వేలాది మంది అభిమానుల మధ్య సత్తాచాటేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకున్నది. వెస్టిండీస్ హార్ట్‌హిట్టర్ అండ్రూ రస్సెల్, క్రిస్ లిన్, బ్రాత్‌వైట్, నితీశ్ రానాతో కోల్‌కతా..రైజర్స్‌కు సవాలు విసురుతున్నది. బౌలింగ్ పరంగా బలహీనంగా ఉన్న కోల్‌కతా ఏ మేరకు హైదరాబాద్‌ను నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Andre Russell, Piyush Chawla, Kuldeep Yadav, Lockie Ferguson, Prasidh Krishna.

Sunrisers Hyderabad (Playing XI): David Warner, Jonny Bairstow(w), Manish Pandey, Deepak Hooda, Shakib Al Hasan, Vijay Shankar, Yusuf Pathan, Rashid Khan, Bhuvneshwar Kumar(c), Sandeep Sharma, Siddarth Kaul.