ప్రియాంక చోప్రా వేశ్యా పాత్రలో

SMTV Desk 2019-03-25 12:33:07  Veshya, Priyanka CHopra,

గతేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో పాటు సంజయ్ లీలా భన్సాలీ..మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ముంబాయికి చెందిన రౌడీరాణి గుంగూబాయి కోఠేవాలి జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందకు సంజయ్ లీలా భన్సాలీ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను ముంబాయిలోని కామటిపుర అనే రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా వేశ్యావాటిక నిర్వాహకురాలు గుంగూబాయిగా నటించబోతుంది. ఈ సినిమాకు ‘గంగుబాయి’ టైటిల్ తో పాటు ‘హీరా మండి’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. కామాటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయి అంటే అక్కడివారు వణికిపోయేవారు. అంతేకాదు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామాటిపుర’గా పిలిచేవారు. చిన్నతనంలో తనకు తెలియకుండా వ్యభిచార కూపంలో కూరుకు పోయిన ఆమె... ఆ తర్వాత రౌడీరాణిగా ఎదిగింది. ముంబాయిలో ఆమె నడిపిన వ్యభిచార గృహాల గురించి ఈ మూవీలో చూపించబోతున్నారు.