పవన్ కళ్యాణ్ కు చింతమనేని కౌంటర్

SMTV Desk 2019-03-25 12:32:06  Pawan Kalyan, Chintamaneni,

తన గురించి వాస్తవాలు తెలుసుకోకుండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారని, ఆయన జనసేనను టీడీపీలో విలీనం చేస్తే తాను ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. తన స్థానం నుంచి ఆయన టీడీపీ నుండి పోటీచేస్తే ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపే బాధ్యత కూడా తాను తీసుకుంటానని తెలిపారు. గతంలో దెందులూరులో నిర్వహించిన రోడ్డుషోలో మాట్లాడుతూ ‘చింతమనేని అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. తాజాగా చింతమనేని ప్రభాకర్‌ వంటి వారు ఉండడం వల్లే తాను తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని పవన్‌కల్యాణ్‌ చేసిన విమర్శలకు దెందులూరు ఎమ్మెల్యే ఘాటైన జవాబిచ్చారు. పార్టీలో చేరడానికి తానే అడ్డు అయితే తప్పుకుంటానని చెప్పారు. ఒక వేళ పవన్‌ గెలిచి అసెంబ్లీకి వస్తే నేనేంటో ఆయనకు తెలియస్తానని స్పష్టం చేశారు. పవన్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చింతమనేని మండిపడ్డారు.