బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో మృతి

SMTV Desk 2019-03-25 11:17:17  BSP, PAwan Kalyan,

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి డా. ఎన్ గౌతమ్ గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో గౌతమ్‌ను వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు గౌతమ్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారని సీపీఎం, జనసేన నేతలు ప్రకటించారు. అతని స్థానంలో మరొకరితో నామినేషన్ వేయించనున్నారు. తిరుపతి మాజీ ఎంపీ వెంకటస్వామి కుమారుడైన గౌతమ్.. హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.