బాలీవుడ్ లోనూ దూసుకెళ్తున్న అల్లు అర్జున్

SMTV Desk 2017-06-02 11:53:58  sarainodu movie, Allu Arjun,Rakulpreethsingh,

ముంబై, జూన్ 2 : అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు చిత్రం తెలుగులో ఘన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ప్రస్తుతం హిందీలోకి అనువాదమై ఉత్తరాది ప్రేక్షకులచే ఆదరణను పొందుతున్నది. రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ ను కొన్ని రోజుల ముందు సోనీ మాక్స్ చానల్ ప్రసారం చేయడంతో, ఆ రోజున యూట్యూబ్ ఆన్ లైన్ ఛానెల్ లోను విడుదల చేయడంతో కేవలం ఒక్క రోజులోనే 6.1 మిలియన్ మంది వీక్షించారని సమాచారం. 4 రోజుల్లో 16 మిలియన్ ల జనాదరణను పొంది రికార్డు సృష్టిందని తెలుగు చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ ప్రతినిధులు తెలిపారు.