నాని జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా

SMTV Desk 2019-03-25 11:03:39  Nani, jersey,

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో చేస్తున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ తో ఇంప్రెస్ చేయడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. అందుకే ఆ అంచనాలతో సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. నాని జెర్సీ వరల్డ్ వైడ్ గా 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 22 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జెర్సీ సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలుపుకుని 40 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నాని చూస్తుంటే 50 కోట్లు కూడా త్వరలోనే టచ్ చేసేలా ఉన్నాడు. ఏప్రిల్ 19న రిలీజ్ ప్లాన్ చేసిన జెర్సీ సినిమా రిజల్ట్ మీద నాని పూర్తి నమ్మకంగా ఉన్నాడు.