మహర్షి హంగామా షురూ..

SMTV Desk 2019-03-25 11:01:38  Maharshi, Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి సినిమా మే 9న రిలీజ్ కాబోతుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ఈ నెల 29న రిలీజ్ కాబోతుందని సినిమా మ్యూజిక్ డైరక్టర్ డిఎస్పి వెళ్లడించాడు.

మహర్షి సాంగ్స్ హంగామా మార్చి 29 నుండి మొదలు కాబోతున్నట్టే. మహేష్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ క్రేజీ మ్యూజిక్ అందిస్తాడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన భరత్ అనే నేనుకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. తన సినిమాలో మ్యూజిక్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించే వంశీ పైడిపల్లి మహర్షి కోసం అద్భుతమైన ట్యూన్స్ రాబట్టుకున్నాడట. మరి మ్యూజిక్ తో మొదలైన మహర్షి సందడి సినిమా మీద ఎలాంటి అంచనాలు పెంచేస్తుందో చూడాలి.