ఆంధ్రవాళ్లని తెలంగాణ వాళ్లు ఎప్పుడు కొట్టారు.. పవన్ పై మండిపడ్డ పోసాని

SMTV Desk 2019-03-25 11:00:10  Posani, pawan Kalyan

తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యల పై మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాజాగా సినీ దర్శక, రచయిత పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ తిట్టిపోశారు. పవన్ కళ్యాణ్ గతంలో కేసీఆర్‌ని స్పూర్తిగా తీసుకోవాలన్న వ్యాఖ్యల్ని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ ఇంటికి వెళ్లింది పపన్ కేసీఆర్‌ని స్పూర్తిగా తీసుకోవాలన్నది పవన్ కేటీఆర్ వాటేసుకున్నది పవన్ కళ్యాణ్. కేటీఆర్ సోదరిని కవితను నా బంగారు తల్లీ అన్నది పవన్ .

ఇప్పుడేమో జగన్‌ని తిడుతూ ఎందుకు కేసీఆర్‌ని బుజాన మోస్తున్నావ్ అంటున్నాడని ? నువ్ తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటావా ? ఇప్పుడు ఓట్లు కోసం ఆంధ్రా వెళ్లి ఆంధ్ర వాళ్లని తెలంగాణ వాళ్లు కొడుతున్నారు. వాళ్ల జాగీరా అంటూ అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని ఇదంతా ఓట్ల కోసమేగా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆంధ్రవాళ్ల భూములు లాక్కుంటున్నారు అన్నావు. ఆయనఎక్కడ లాక్కున్నారు? ఎవర్ని బెదిరించారు? భూములు నిజంగా లాక్కున్నారని చూపిస్తే పాదాభివందనం చేస్తా. ఆంధ్రవాళ్లని కొడుతున్నారు చూస్తుంటే విసుగుపుడుతుంది అన్నావ్. ఆంధ్రవాళ్లని తెలంగాణ వాళ్లు ఎప్పుడు కొట్టారు. ఎక్కడ కొట్టారు? కొడుతుంటే నువ్ ఎంత మందిని అడ్డుకున్నావ్ ఇక్కడ చాలామంది ఆంధ్ర వాళ్లు ఉన్నారు అందరి ఇళ్లకు వెళ్దాం.. ఒక్కర్ని చూపించు ఎవరైనా కొట్టారని చెప్తే నీకు దండం పెడతా. ఎందుకు పవన్ కళ్యాణ్.. పార్టీ పెట్టేటప్పుడు ఎన్ని చెప్పావ్. అన్ని పార్టీల మాదిరిగా కాదు అంటే సంతోషించా కానీ అదంతా మర్చేసావ్ అని ఆయన విమర్శించారు.