జనసేనకే ఓటు...పవనే సీఎం : హైపర్ ఆది

SMTV Desk 2019-03-25 10:55:58  hyper aadi, janasena, pawan kalyan, nadendla manohar

మార్చ్ 23: జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న కమెడియన్ హైపర్ ఆది పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గెలుపు ఖాయమని అయన జోస్యం చెప్పారు. కొల్లిపొరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆది ఈ వ్యాఖ్యలు చేశారు. తెనాలిని అభివృద్ధి చేసిన ఘనత మనోహర్‌దేనన్నారు. అంతేకాదు జనసేన కు ఓటు వేయాలని.. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలనీ పిలుపునిచ్చారు. కాగా నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇక గతంలో మనోహర్ ఇక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.