CSK vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

SMTV Desk 2019-03-24 20:40:20  csk vs rcb, ipl 2019, virat kohli, mahendra singh dhoni

మార్చ్ 23: ఐపీఎల్ 2019 సీజన్‌లో ప్రారంభ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈరోజు జరుగుతున్న టోర్నీ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ స్పిన్‌కి అనుకూలించేలా కనిపిస్తుండటంతో చెన్నై ముగ్గురు స్పిన్నర్లు, బెంగళూరు ఇద్దరు స్పిన్నర్లలతో బరిలోకి దిగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి (కెప్టెన్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, సిమ్రాన్ హెట్‌మెయర్, శివమ్ దూబే, గ్రాండ్‌హోమ్, ఉమేశ్ యాదవ్, చాహల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ.