జమ్మూలో కాల్పులు...ఇద్దరు ఉగ్రవాదులు హతం

SMTV Desk 2019-03-24 20:37:16  jammu kashmir, indian army, terrorists

శ్రీనగర్, మార్చ్ 23: జమ్ముకశ్మీర్ లోని వార్‌పోరాలో ఈ రోజు ఉగ్రవాడులకు, భద్రత బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా మరో ఇద్దరు ఉగ్రమూకలు పరారైనట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి భద్రతా దళాలు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రీ, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పూంచ్ సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ నిబంధనలు మరోసారి ఉల్లఘించారు. అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.