పవన్ కళ్యాణ్ .. ఏంటి ఈ డబుల్ గేమ్..

SMTV Desk 2019-03-24 20:31:33  Pawan Kalyan, Botsa

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీని ప్రశ్నిస్తానన్న పవన్.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం సిగ్గు చేటని బొత్స విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పవన్‌.. మాలో కూడా రక్తం ఉంది.. మాకూ పౌరుషం ఉంది. కానీ నీలా రోజుకో మాట, పూటకో మాట మాట్లాడడం రాదు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో గెలిచినప్పుడు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోదరుడు నాగబాబు అయితే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటేశానని.. నా ఓటుకు విలువ వచ్చిందని అన్నారు. ఇప్పుడేమో టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. ఏంటి ఈ డబుల్ గేమ్.. టీఆర్ఎస్ గెలవాలని ఎవరు కోరుకున్నారు..? అని పవన్ ను బొత్స ప్రశ్నించారు.

పది రోజుల క్రితం వివేకానందరెడ్డి హత్య జరిగితే ఎవరు చేశారో ఇప్పటివరకూ తెలుసుకోకుండా ప్రతిపక్షాన్ని పవన్‌ విమర్శించడం సరికాదన్న బొత్స.. ఆ హత్య ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు