గిన్నీస్ రికార్డు కోసం స్టంట్స్...ప్రాణాల మీదకు తెచ్చుకున్న 8 మంది

SMTV Desk 2019-03-24 20:15:51  Guinness World Records, america, human pyramid stunt

మార్చ్ 23: గిన్నీస్ రికార్డు కోసం అమెరికాలో కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఎలాంటి సేఫ్టీ లేకుండా 20 అడుగుల ఎత్తు నుంచి చేసిన ఫీట్ ఫెయిల్ అయింది. దీంతో ఒక్కసారిగా పై నుంచి ఐదుమంది కింద పడ్డారు. హ్యూమన్ పిరమిడ్ రూపంలో 8 మంది ప్రమాదకరమైన స్టంట్ చేశారు. 20 అడుగుల ఎత్తులో ఉన్న తాడుపై ఈ ఫీట్ చేశారు. ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఐదుగురు కిందపడగా ముగ్గురు మాత్రం తాడు పట్టుకుని సేఫ్ అయ్యారు. 20 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి ఎముకలు విరిగిపోయాయి. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.