సీఎస్కే vs ఆర్సీబీ....రికార్డుల్లో చెన్నైదే పైచేయి

SMTV Desk 2019-03-23 19:12:30  ipl 2019, chennai super kings vs royal challengers benulore, virat kohli, mahendra singh dhoni

మార్చ్ 23: మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ 2019 సీజన్ చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 8 గంటలకి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని జట్ల మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఐపీఎల్‌ చరిత్రతో బెంగళూరుపై చెన్నైదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకూ చెన్నై, బెంగళూరు జట్లు 22 సార్లు తలపడగా.. ఏకంగా 14 సార్లు చెన్నై జట్టే విజయాన్ని అందుకుంది. మిగిలిన ఏడింట్లో బెంగళూరు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 2014, మే 24 నుంచి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఈ రెండు జట్లూ తలపడగా.. ఆరింట్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న చెన్నై జట్టు 2016, 2017 ఐపీఎల్‌ సీజన్లకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చెన్నైపై ఆఖరిసారిగా 2014, మే 18న బెంగళూరు జట్టు గెలిచింది.

చెన్నై జట్టు అంచనా: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, బిల్లింగ్స్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శాంట్నర్, శార్ధూల్ ఠాకూర్.

బెంగళూరు జట్టు అంచనా: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సిమ్రాన్ హిట్‌మెయిర్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్ .