పవన్‌కు చంద్రబాబు పేమెంట్ పెంచారు

SMTV Desk 2019-03-23 18:09:57  Chandra Babu, PAwan Kalyan, Vijaya Sai reddy

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరడ్డి ట్విట్టర్‌లో కౌంటరిచ్చారు. పవన్‌కు చంద్రబాబు పేమెంట్ బాగా పెంచినట్టున్నారు. అందుకే తెగ రెచ్చిపోతున్నారంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీల్లోకి లాగి మాట్లాడుతున్నారు.

కొంచెం కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతక తప్పదేమో అని విజయసాయిరెడ్డి అన్నారు. దీంతో పాటు గెలిచే పార్టీనే అన్ని పక్షాలు విమర్శిస్తాయని, చంద్రబాబు, పవన్, కేఏ పాల్ లు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలోనైనా వీళ్లు ఒక క్లారిటీతో ఉన్నారంటూ విమర్శించారు.