జనసేనకే మద్దతు

SMTV Desk 2019-03-23 16:49:24  janasena, Pawan Kalyan

ఏపీలో ఎన్నికలు హీట్ రేపుతున్న వేళ మంచు మనోజ్ తన ట్వీట్లతో ట్విట్టర్‌ లో హీట్ పెంచుతున్నాడు. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నిన్న తిరుపతిలో ఆయన కూడా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో చదువుతోన్న విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంలేదని ఆరోపిస్తూ మోహన్‌బాబు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. దీని మీద టీడీపీ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో మనోజ్ వారికీ కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఏపీ ప్లానింగ్ కమిటీ వైఎస్ చైర్మన్ కుటుంబరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంచు మనోజ్ శనివారం ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. శ్రీ విద్యానికేతన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల లెక్కలను ప్రజల ముందు ఉంచారు. మనోజ్ ట్వీట్లకు విపరీతంగా స్పందన వస్తోంది. ఆయనకు మద్దతు పలుకుతూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు ఈ ఎన్నికల్లో మీ మద్దతు జనసేనకా లేక టీడీపీకా అని అడిగితే ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా జనసేనకే మద్దతు తెలియజేస్తానని మనోజ్ స్పష్టం చేశారు. దీనికి ఓ అభిమాని రిప్లై ఇస్తూ.. ‘అన్న చిన్న డౌట్, ఇప్పుడు ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేయన్న, అది నీ ఇష్టం. కానీ, ఓ 5/10 సంవత్సరాల తరవాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తోడుగా ఉంటావా అన్నా అని ప్రశ్నించాడు. దీనికి మనోజ్ స్పందించారు. ‘తారక్ వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడు?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’ అని మనోజ్ ట్వీట్ చేశాడు.