భీమవరం లో పవన్ కళ్యాణ్ vs కే ఏ పాల్

SMTV Desk 2019-03-23 16:45:02  Pawan Kalyan, KA PAul

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారని అందరు అనుకుంటున్నా సందర్భంలో అనూహ్యంగా విశాఖ జిల్లా గాజువాక నుంచి మరియు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేస్తానని తెలుపగా రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి మొదలయ్యింది.దీనితో పవన్ సునాయాసంగా గెలవనున్నారని ఒక పక్క పవన్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే..సరికొత్తగా ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చి హడావుడి చేసేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఇప్పుడు సంచలన ప్రకటన చేస్తున్నారు.

నేను ఇది వరకు పాలకొల్లులో నామినేషన్ వేద్దామనుకున్నాను,కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకొని భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలుపుతున్నారు.అందుకు కారణం కూడా పవన్ కల్యాణే అని తెలుపుతున్నారు,పవన్ పై పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానని పాల్ అంటున్నారు.ఇది వరకే పాల్ తాను పోటీ చేస్తే పవన్ కు డిపాజిట్లు కూడా రావని సంచలన వ్యాఖ్యలు చేసారు,అన్నట్టుగానే ఇప్పుడు పవన్ పై పోటీకి సిద్ధమయ్యారు,వచ్చే సోమవారమే తాను నామినేషన్ వేయనున్నానని తెలుపుతున్నారు.మరి పాల్ కి ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందో లేక నిజంగానే గెలిచేస్తారో చూడాలి.