గంభీర్ కామెంట్...విరాట్ కౌంటర్

SMTV Desk 2019-03-23 16:40:08  virat kohli, royal challengers bengulore, gautam gambhir, team india capten

మార్చ్ 23: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేప్టేన్సి విధానంపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై కోహ్లీ తాజాగా స్పందించాడు. ఈ సదర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ...‘ఐపీఎల్ టైటిల్ గెలవాలని నేనూ కోరుకుంటున్నాను. దానికోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా. కానీ.. కేవలం ఐపీఎల్‌ టైటిల్ ఆధారంగా నా సామర్థ్యాన్ని అంచనా వేయడాన్ని ఒప్పుకోను. ప్రతిసారీ టైటిల్ గెలవాలనే కోరుకుంటా. కానీ.. అన్నిసార్లూ అది సాధ్యంకాకపోవచ్చు. బయటవాళ్లలా నేనూ ఆలోచిస్తే.. ఐదు మ్యాచ్‌లు కూడా ఆడకుండానే.. ఇంట్లో కూర్చుంటాను. చాలా మంది ఇలా విమర్శలతో వార్తల్లో నిలవాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. కానీ.. నాకంటూ ఓ బాధ్యత ఉంది. ఒక జట్టు కెప్టెన్‌గా.. ఐపీఎల్‌ టైటిల్‌ను జట్టుకి అందించాలని కోరుకుంటున్నా. ఆ ప్రేరణతోనే ఈసారి కూడా బరిలోకి దిగుతున్నాం’ అని కోహ్లీ వెల్లడించాడు.