టిడిపి ఎమ్మెల్యే అనుచరుని హత్యకు ప్రయత్నం!

SMTV Desk 2019-03-23 16:33:02  tdp, mla, assembly elections, yarapatineni srinivasarao, attaempt to murder mla follower

గుంటూరు, మార్చ్ 23: ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఈ నేపథ్యంలోనే టిడిపి నుంచి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు ముప్పన వెంకటేశ్వర్లును హత్య చేయడానికి ఇద్దరు వ్యక్తులు పథకం తయారుచేసుకున్నట్లు సమాచారం. కాగా వారు మారణాయుధాలతో పోలీసులకు చిక్కడం పల్నాడులో ఆందోళన రేకెత్తించింది. ఎమ్మెల్యే శ్రీనివాసరావు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా ఎమ్మెల్యే అనుచరుడు వుప్పనను మట్టుబెట్టాలని మాచవరం మండలం గోవిందాపురం, పిడుగురాళ్లకు చెందిన వ్యక్తులు మారణాయుధాలతో జనంలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రివాల్వర్లు, మూడు తపంచాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీని వెనుక ఎవరున్నారు, అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.