దీపికా పేరుతో కాజల్ ఫోటో

SMTV Desk 2019-03-23 14:03:29  deepika, kajal , pic,

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏపీలో నకిలీ ఓట్ల ఏరివేత మొదలు పెట్టింది, రాష్ట్రంలోమ్ నకిలీ ఓట్ల తొలగింపునకు ఇటీవల దాఖలైన ఫామ్ 7 దరఖాస్తుల్లో దాదాపు 85 శాతం నకిలీవేనని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్లను తొలగించాల్సిందిగా 9.5 లక్షల దరఖాస్తులు అందగా, వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా పలు నకిలీ ఓట్లు వెలుగులోకి వచ్చాయి, వాటిలో దీపికా పేరుతో, కాజల్ ఫోటోతో ఉన్న నకిలీ ఓటు ఒకటి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దీపికా పదుకొణే పేరుతో కాజల్ అగర్వాల్ ఫోటో ప్రత్యక్షం అయింది. దీపికా పదుకొణే తండ్రి పేరు రమేష్ కొండా అని ఆమె వయస్సు 22 అని ప్రింట్ చేశారు. ప్రస్తుతం దీపికా పేరుతో ఉన్న కాజల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.