వివేకానందరెడ్డి హత్య కేసు లేటెస్ట్ అప్డేట్

SMTV Desk 2019-03-23 12:31:25  Vivekananda Case

వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు భాగంగా వైఎస్ జగన్ అనుచరుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని గురువారం రాత్రి సిట్ అదుపులోకి తీసుకుంది. దేవిరెడ్డి అత్యంత సన్నిహితులైన నాగప్పకుమారుడు శివను సిట్ బృందం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణమన్న కోణంలో సిట్ దర్యాప్తు చేపడుతోంది. వివేకా అనుచరులే ఆయన్ను హత్య చేశారా అని సిట్ అనుమానితులపై ప్రశ్నలు సంధిస్తోంది. పరమేశ్వరరెడ్డి, ఎర్రగంగిరెడ్డిలు సూత్రధారులుగా కాగా చంద్రశేఖర్ కీలక పాత్ర వహించాడని సిట్ ప్రాధమిక అంచనాకు వచ్చింది. ఇప్పటి వరకు 45మందిని సిట్ రహస్య ప్రాంతాలలో విచారణ చేసింది. కాగా హత్య జరిగిన రోజు పులివెందులలోని చిన్నా అనే వ్యక్తికి చెందిన స్కార్పియోలో చంద్రశేఖర్ తిరుగాడినట్లు సిపి ఫుటేజీలను దర్యాప్తు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేవిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సిట్ మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పరమేశ్వరరెడ్డి అనుచరులుగా భావిస్తున్న సింహాద్రిపురం మండలం కతనూరుకు చెందిన శేఖర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌తో పాటు మరోఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. విచారణలో భాగంగా వివేకా కాల్‌డేటాలోని మెసేజ్‌లను సిట్ దృష్టిసారించింది. కాగా వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు ‘బీకేర్ ఫూల్’ అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఆ మెసేజ్ ఎవరు పంపారు ? ఎందుకు పంపారని సిట్ దర్యాప్తు సాగిస్తోంది.కేసు విచారణలో భాగంగా సిట్ వివేక అనుచరులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా వివేకా అనుచరులు ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డిల హస్తం ఉందన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డిల మధ్య వివాదం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులోని రూ.150 కోట్ల విలువ చేసే సెటిల్‌మెంట్ వ్యవహారంలో వివేకా అనుచరుల మధ్య గొడవలున్నట్లు సిట్ గుర్తించింది.

ఈక్రమంలో భూ వ్యవహారంలో 1.5కోట్ల మేరకు నగదు లావాదేవీల విషయంలో వివేకా, గంగిరెడ్డిల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వివేకా హత్య విషయంలో గండిరెడ్డి కీలక పాత్ర వహించాడన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో గంగిరెడ్డిని గత వారం రోజులుగా రహస్య ప్రాంతంలో సిట్ విచారిస్తోంది. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందునుంచే కొంతమంది కిరాయి హంతకులు రిక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈక్రమంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వరరెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల్లో వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని సిట్ బృందం తెలిపింది.