ఫేక్ న్యూస్ పై ట్విట్టర్ లో స్పందించిన నితిన్

SMTV Desk 2019-03-23 12:27:56  Nithin,

హీరో నితిన్ గత చిత్రం శ్రీనివాస కళ్యాణం వచ్చి చాలా కాలం అవుతుంది, ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా మొదలుపెట్టడం కానీ, తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేయటం కానీ జరగలేదు. ఆ మధ్య ట్విట్టర్ లో తన తర్వాతి సినిమాల గురించిన అప్డేట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని వెల్లడించాడు, అన్నట్టుగానే తాజాగా తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ట్విట్టర్ లో తెలియజేసాడు . నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ” భీష్మ” సినిమా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రమేశ్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడనీ, ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని నిన్నటి నుండి ప్రచారం జరిగింది. ఆ తరువాత కొంతసేపటికి తాను చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాననీ, ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని నితిన్ ట్వీట్ చేశాడు.అయితే ఆయన రమేశ్ వర్మతో సినిమాను గురించి ప్రస్తావించకపోవడం అభిమానులను అయోమయానికి గురిచేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన నితిన్ తాను చేయబోయే సినిమాలకు సంబందించిన అప్డేట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తానని, ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ చెప్పుకొచ్చారు.