ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్తులు ఎంతో తెలుసా ?

SMTV Desk 2019-03-23 12:25:07  Ap Minister, Nara lokesh,

ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్తులు రూ.350 కోట్లేనట. ఈ విషయం ఆయనే స్వయంగా తను సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. తన పేరిట రూ.66.76 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య పేరిట రూ.18.74 కోట్లు, తన కొడుకు పేరిట రూ.16.17 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు.


తనకు రూ.5.72 కోట్లకుపైగా, తన భార్య పేరిట రూ.3.41 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయని తెలిపారు. 2008లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవన్నారు. హెరిటేజ్‌లో తన పేరిట రూ.47.32 లక్షల విలువైన షేర్లు.. తన భార్య పేరిట రూ.10.34 కోట్ల విలువైన షేర్లు, తన కొడుకు పేరిట రూ. 1.35 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు.

అఫిడవిట్‌లో చరాస్తుల వివరాలు..



నారా లోకేష్ – రూ.253,68,92,998

నారా బ్రాహ్మణి – రూ.14,40,90,905

నారా దేవాన్ష్ – రూ.3,88,78,778



స్థిరాస్తుల వివరాలు..



నారా లోకేష్ – రూ.66,76,11,020

నారా బ్రాహ్మణి – రూ.18,74,47,246

నారా దేవాన్ష్ – రూ.16,17,32,754



అప్పుల వివరాలు..

నారా లోకేష్ – రూ.5,72,43,517

నారా బ్రాహ్మణి – రూ.3,41,29,673

నారా దేవాన్ష్ – NIL