ప్రదీప్ హీరోగా త్వరలో ఓ సినిమా

SMTV Desk 2019-03-23 12:12:26  pradeep machiraju

యాంకర్ గా బుల్లితెర మీద తన సత్తా చాటుతున్న ప్రదీప్ మాచిరాజు ఛానెల్ ఏదైనా.. ప్రోగ్రాం ఏదైనా అతను వచ్చాడంటే అదరగొట్టడమే.. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ప్రదీప్ బుల్లితెర మీద క్రేజ్ వచ్చాక రిజిస్టర్ పాత్రలకు మాత్రమే ఓకే చెబుతున్నాడు. ఇక ప్రస్తుతం అతను సిల్వర్ స్క్రీన్ పై కూడా తన అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటున్నాడు. ప్రదీప్ హీరోగా త్వరలో ఓ సినిమా తెరకెక్కనుందట.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన మున్న దర్శకత్వంలో ప్రదీప్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. 1945లో జరిగే కథగా ఈ మూవీ ఉంటుందట. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.