కేసీఆర్‌కు షాక్ .. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా

SMTV Desk 2019-03-23 12:09:50  KCR, MP vivek

టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకాలం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన జి. వివేకానంద్ ఆ పదవికి రాజీనామా చేశారు.
ఈ రోజు కార్యకర్తలతో సమావేశం అనంతరం రామగుండంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైంది.

ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009లో రాజకీయరంగ ప్రవేశంచేసి కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దపల్లి లోకసభ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.