లాభాల ట్రెండ్ ముగుసింది!

SMTV Desk 2019-03-23 11:42:24  Sensex, Nifty, Stock market, Share markets

మార్చ్ 22: దేశీ మార్కెట్ లాభాల సూచీలు గత వారం రోజులుగా పరుగులు పెడుతూ వచ్చి శుక్రవారం నష్టాల్లో క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల నష్టంతో 38,165 పాయింట్ల వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 11,457 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, ఫిచ్‌ రేటింగ్స్‌ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేయడటం, పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నిఫ్టీ 50లో ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, ఏసియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ దాదాపు 4 శాతం పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ దాదాపు నష్టాల్లోనే ముగిశాయి. ఒక్క నిఫ్టీ రియల్టీ మాత్రమ లాభాల్లో క్లోజయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో షేర్లు ఎక్కువగా పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 30,000 పాయింట్ల మార్క్‌ను అందుకుంది.