విరాట్, అనుష్క యాడ్ వైరల్

SMTV Desk 2019-03-23 11:40:19  virat kohli, anushka sharma, shyam steek company ad

మార్చ్ 22: టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మతో మరోసారి యాడ్‌లో మెరిశాడు. తాజాగా ఐపీఎల్ 2019 సీజన్ నేపథ్యంలో.. ఈ విరుష్క జోడీ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు శ్యామ్ స్టీల్ కంపెనీ ఓ రొమాంటింగ్‌ యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ యాడ్‌ని తాజాగా విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. కోహ్లీ షేర్ చేసిన యాడ్‌లో ఏముందంటే..? బిజీగా పనిచేసుకుంటున్న అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. వెంటనే ఆ కాఫీ తాగేందుకు అనుష్క శర్మ ప్రయత్నించగా.. కాస్త ఆగు.. వేడిగా ఉందంటూ విరాట్ కోహ్లీ ప్రేమతో వారించి కాఫీని చల్లారుస్తాడు. ఆ ప్రేమకి ముగ్ధురాలైన అనుష్క శర్మ.. ప్రేమగా కోహ్లీ ముక్కు పట్టుకుని ముద్దాడుతుంది. అందరూ అడుగుతుంటారు.. ‘మీ ప్రేమలో స్పెషల్ ఏంటని..?’ అని కోహ్లీ అనగా.. మధ్యలో అనుష్క శర్మ కలగజేసుకుని.. ‘ఏమీ లేదు’ అని ఆ తర్వాత.. ‘జస్ట్ ప్యూర్ లవ్’ అని నవ్వేస్తుంది. ఈ వీడియో కోహ్లీ అభిమానులకు ఓ కానుకగా అయ్యింది ఇప్పుడు.