మార్కెట్లోకి హోండా సీబీ1000 ప్లస్

SMTV Desk 2019-03-22 18:25:50  honda cb 1000r plus, honda

మార్చ్ 22: హోండా మోటార్స్ తాజాగా సీబీ1000 ప్లస్ మోటార్‌సైకిల్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో ఈ బైక్ ధర రూ.14.46 లక్షలుగా ఉంది. కంపెనీ గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ బైక్‌‌లో స్వల్ప మార్పులతో కొత్త బైక్‌ను ఆవిష్కరించింది. సీబీ1000 ప్లస్ గ్లోబల్ ఎడిషన్ బైక్ రెడ్, వైట్, బ్లూ రంగుల కాంబినేషన్‌లో అందుబాటులో ఉండనుంది. బైక్ మీద ఒక్కరం మాత్రమే కూర్చోగలం. వెనుక సీట్ ఉండదు. అలాగే బైక్‌లో ఎస్‌సీ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్‌హాస్ట్ ఉంటుంది. ఇందులో రెండు క్యాన్స్ ఉంటాయి. రేడియేటర్, ఫిల్టర్ బాక్స్, ఎక్స్‌హాస్ట్ షీల్డ్ మీద కార్బన్ ఫైబర్ ఉంటుంది. రెట్రో స్టైల్డ్ హోండా వింగ్, 1000ఆర్ అనే ఫీచర్లు ఉన్నాయి. బైక్‌లో 998 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. అలాగే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రైడ్ బై వైర్ టెక్నాలజీతో కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది. ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంటుంది. ఆరు గేర్లు ఉంటాయి. వీటి గ్లోబల్ అమ్మకాలు ఏప్రిల్ నుంచి మొదలవుతాయి.