మైనర్ విద్యార్థులతో టీచర్ అక్రమ సంబంధం...నగ్నంగా నృత్యం చేస్తూ...

SMTV Desk 2019-03-22 18:24:55  teacher students relationship, tamilandu, government teacher illegal relationship with tuition students

చెన్నై, మార్చ్ 22: విద్యార్థులకు పాటాలు చెప్పాల్సిన ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. ట్యూషన్‌కు వచ్చిన మైనర్ విద్యార్థులతో రోజు నగ్నంగా నృత్యాలు చేస్తూ వారితో శారీరక సంబంధం కూడ పెట్టుకొంది. పూర్తి వివరాల ప్రకారం...తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణమలైకు సమీపంలోని ఆరణిలోని ప్రభుత్వ స్కూల్‌లో 30 ఏళ్ల మహిళ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె ఆ స్కూల్‌లో ఇంగ్లీష్ చెబుతుంది. ఓ మైనర్ విద్యార్ధికి ఇంగ్లీష్ ట్యూషన్ చెబుతానని తన ఇంటికి ఆమె తీసుకొచ్చేది. టీచర్ భర్త కూడ ప్రభుత్వ ఉపాధ్యాయుడే. ఇంటికి ట్యూషన్‌ పేరుతో తీసుకొచ్చిన మైనర్ బాలుడితో ఆమె లైంగిక సంబంధాలను కొనసాగించింది. ఆ విద్యార్థితో నృత్యాలు చేస్తూ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకొంది. ఒక రోజు ఆమె భర్త ఈ దృశ్యాలను చూశాడు. భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. పద్దతిని మానుకోవాలని ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమె తన పద్దతిని మార్చుకోలేదు. పైగా ఆ విద్యార్థితో లైంగిక సంబంధాలను కొనసాగించింది. దీంతో మహిళ టీచర్ భర్త జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ విచారణ నిర్వహించింది. ఈ విచారణలో మైనర్ బాలుడితో టీచర్ లైంగిక సంబంధం నిజమేనని తేలింది. దీంతో ఆమెను ఆరణి మహిళా పోలీసులు అరస్ట్ చేశారు.ఇదే తరహాలో ఆ మహిళ టీచర్ నలుగురైదుగురు మైనర్ విద్యార్థులతో లైంగిక సంబంధాలను కలిగి ఉందని గుర్తించారు.